పోలవరాన్ని నిలిపివేసింది జగన్ ప్రభుత్వమే: మంత్రి నిమ్మల

83చూసినవారు
పోలవరాన్ని నిలిపివేసింది జగన్ ప్రభుత్వమే: మంత్రి నిమ్మల
AP: వైఎస్ జగన్ ప్రభుత్వమే పోలవరాన్ని నిలిపివేసిందని మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అసెంబ్లీలో మంత్రి ఆరోపించారు. డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడానికి ఆ ప్రభుత్వమే కారణమన్నారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు ద్వారా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు నీరిందిస్తామని మంత్రి హామీనిచ్చారు.

సంబంధిత పోస్ట్