త్వరలో ‘తల్లికి వందనం’ పథకం విధివిధానాలు ప్రకటిస్తాం: లోకేశ్

55చూసినవారు
త్వరలో ‘తల్లికి వందనం’ పథకం విధివిధానాలు ప్రకటిస్తాం: లోకేశ్
AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ పథకంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కాగా, వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే (జూన్)లోగా ఈ పథకం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్