TG: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త గడి రెసిడెన్షియల్ పాఠశాలలో భవనం మొదటి అంతస్తు నుంచి దూకి పదో తరగతి చదువుతున్న తబిత అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తబితను పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో మనస్థాపం చెంది భవనం పైనుంచి దూకిందని అన్నారు. ఈ ఘటనలో విద్యార్థిని కాలు విరిగిందని, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.