బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం? ప్రతి రోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేల్ ఘటన అత్యంత హేయం, దుర్మార్గం' అని జగన్ మండిపడ్డారు.