హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్ ఇది. ప్రారంభ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది. 293.52సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా హోండా ఈ మోటార్ సైకిల్‌ని అభివృద్ధి చేసిందని సీఈఓ సుత్సుము తెలిపారు.