సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

69చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇవాళ బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో తనకు ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపులకు రిజర్వేషన్‌ అంశంపై ఈ నెల 28న హైకోర్టు విచారణ చేయనుందన్నారు. ఈలోగా కూటమి ప్రభుత్వం తన వైఖరి ఏమిటో తెలపాలని జోగయ్య తన లేఖలో కోరారు.

సంబంధిత పోస్ట్