AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘YCP పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా?’ అని షర్మిల ప్రశ్నించారు.