అమరావతిలో బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని ఆయన అన్నారు. 'పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మీ ప్రతినిధిని మాత్రమే. కష్టపడి పనిచేసి, నష్టపోయిన వారికి అండగా ఉంటాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది వరకు అంతా కదలిరావాలి. ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి' అని సూచించారు.