రూపాయి సింబల్‌ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? : పవన్ కళ్యాణ్

76చూసినవారు
రూపాయి సింబల్‌ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? : పవన్ కళ్యాణ్
త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య పెనువివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ స్పందిస్తూ డీఎంకే తీరును ఆక్షేపించారు. "భారతదేశానికి బహుభాషలే కావాలి. భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. రూపాయి సింబల్‌ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండద్దా?’ అంటూ పవన్‌ నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్