జగన్.. మీకు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పశ్నించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా?. విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలినందుకా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అందుకే మీకు సంఘీభావం ప్రకటించలేదు.’ అని షర్మిల అన్నారు.