పల్లీలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పల్లీలలో ఉండే ప్రోటీన్, కొవ్వులు, మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ వారికి పల్లీలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీనిలో లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. వీరు పల్లీలను మితంగా, సరైన రీతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.