గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు వచ్చేలా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయాలు అవసరమో గుర్తించి.. వాటిని కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. 2025 జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం వెల్లడించారు.