వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 'నాని బాగోతాలన్నీ నాకు తెలుసు. మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదు. వైసీపీ పాలనలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు మంచితనంతోనే తమ కార్యకర్తలు మౌనంగా ఉన్నారు. లేకుంటే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చేవారా?' అని ప్రశ్నించారు.