TG: మా పిల్లలకు తిండి పెట్టడం లేదని ఆరోపిస్తూ కేజీబీవీ పాఠశాల హాస్టల్ ముందు తల్లిదండ్రులు నిరసన తెలుపుతున్న ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. దిలావర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని, పిల్లలను చూడ్డానికి కూడా హాస్టల్ లోపలికి సిబ్బంది అనుమతించలేదని ఆందోళనకు దిగారు. దీంతో తమ పిల్లలకు తిండి పెట్టడం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కాదని, తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్లారు.