AP: అనకాపల్లిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నర్సీపట్నంలోని వెంకునాయుడుపేట గ్రామానికి చెందిన రమణ అనే రిటైర్డ్ నేవి ఉద్యోగి శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి.. కొడుకు భాస్కర్‌తో గొడవపడ్డారు. ఈ క్రమంలో కొడుకు భాస్కర్‌ను రమణ హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, తండ్రీకొడుకులకు పెన్షన్ డబ్బుల అంశంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు వెల్లడించారు.