AP: టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో హోల్‌సేల్ వ్యాపారులకు కేజీ రూ.5లకే అమ్ముతున్నారు. ధరలు తగ్గినప్పుడు కేజీ రూ.8కి కొనాలన్న వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా ధర రూ.15 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు. ధర దారుణంగా పడిపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.