పోరుమామిళ్ల పట్టణంలో బద్వేల్ వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో.. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పేదబడుగు బలహీనవర్గాల అభివృద్ధికి జగన్ కృషి చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 2029లో జగన్ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమని అయన అన్నారు.