మెగా డీఎస్సీ పై చంద్రబాబు మొదటి సంతకం చేయాలి: చిన్ని

65చూసినవారు
మెగా డీఎస్సీ పై చంద్రబాబు మొదటి సంతకం చేయాలి: చిన్ని
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ పై చంద్రబాబు మొదటి సంతకం చేసి హామీని అమలు పరచాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనం నందు సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు, ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున, ఓబుల్ రెడ్డి, బాల గురయ్యా, యువరాజ్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్