కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

72చూసినవారు
కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతాబలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దుకి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని కాల్చి చంపాయి. కథువా ఎస్పీ అనయత్ అలీ చౌదరి ఎన్‌కౌంటర్ స్థలంలోనే ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్