కలసపాడు మండలం సింగరాయపల్లె సమీపంలోని బుధవారం సత్రం వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సింగరాయపల్లికి చెందిన వ్యక్తులు కలసపాడు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఎదురుగా బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. 108 ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.