ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటే కుదరదు

65చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళవారం వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటే కుదరదన్నారు.

సంబంధిత పోస్ట్