కన్నుల పండుగగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

85చూసినవారు
మహమ్మద్ ప్రవక్త జయంతి పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ వేడుకలను సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో జామియా మసీదు, ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్దలు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మలమడుగులోని పలగాడి వీధి, అంబా భవాని వీధి, కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, తాడిపత్రి రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది.

సంబంధిత పోస్ట్