దేవస్థానం భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి

55చూసినవారు
దేవస్థానం భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
వేంపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న వృశభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమణ దారుల నుంచి కాపాడాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం దేవస్థాన ఈవో విశ్వనాథరెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దేవస్థానానికి సంబంధించి 70 సెంట్ల స్థలం ఉందని, దాని విలువ రూ. కోట్లు ఉంటుందని తెలిపారు. ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్