కొండాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రధాన రహదారి వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు కోరుచున్నారు. పిహెచ్సీకి వెళ్లేదారిలో తరుచూ పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయన్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రజలు, రోగులు, సిబ్బంది పీహెచ్సి వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.