కడప జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. సోమవారం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి వారు తీసుకొనివచ్చారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.