జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. గురువారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ అభివృద్ధి కోసం మా దేవగుడి కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరోలా మాట్లాడం మీకే చెల్లుబాటు అవుతుందన్నారు.