జమ్మలమడుగు: నర్సింగ్ కళాశాల వార్డెన్ కు షోకాజ్ నోటీసులు

77చూసినవారు
జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ ఆసుపత్రి ఆవరణలోని కొంతమంది విద్యార్థినులు మెస్ ఫీజు చెల్లించలేదని యాజమాన్యం గురువారం రాత్రి భోజనం పెట్టలేదు. రాత్రి 10 గంటలు దాటినా భోజనం అందకపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శనివారం సూపరింటెండెంట్ డా. అగస్టిన్ రాజు, పట్టణ ఎస్సై రామకృష్ణ కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం కళాశాల వార్డెన్ విషయం తమ దృష్టికి తేలేదని ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్