ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారిగా ఆదివారం ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు కి వెళ్తున్న సమయంలో ఎర్రగుంట్లలో జమ్మలమడుగు నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ఘన స్వాగతం పలికారు. కూటమి సభ్యులతో కలిసి గజమాలతో సత్కరించారు. మంత్రికి ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి లోని అల్లసాని పెద్దన విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించి తిరిగి ప్రొద్దుటూరు బయలుదేరారు.