జమ్మలమడుగు పట్టణంలోని ఎన్జిఓ కార్యాలయంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడు దపాలుగా అధికారంలోకి వచ్చినా విభజన హామీలు ఏమి అమలు చేయలేదన్నారు. నష్టాలు వస్తున్నాయని సాకుతో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కేంద్రం విరవించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ మియా,ఇర్షాద్,మహమ్మద్, ఇమామ్ భాష, కౌశిక్ లు పాల్గొన్నారు.