జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా కొండాపురం- తాడపత్రి మీదుగా ముద్దనూరు వరకు 4 వరుసల రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంట్రాక్టును సొంతం చేసుకున్న రిత్విక్ సంస్థ అధునాతనమైన టెక్నాలజీ గల యంత్రాలను దిగుమతి చేసి పనులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం పింజి అనంతపురం వద్ద డివైడర్ పనులు జరుగుతుండగా ఓ కాంక్రీట్ డివైడర్ గోడను కూలీలు లేకుండానే ఈ యంత్రం నిర్మించిన ఘటన చూపరులను ఆకట్టుకుంది.