ముద్దనూరు: గొర్రెలు, మేకలకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం

51చూసినవారు
ముద్దనూరు: గొర్రెలు, మేకలకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం
కడప జిల్లా ముద్దనూరు గ్రామ పంచాయితీలో మంగళవారం పశు వైద్యాధికారులు గొర్రెలు, మేకలకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వాసా శ్రీనివాస ఆధ్వర్యంలో 950 గొర్రెలకు, 175 మేకలకు నట్టల నివారణ మందు త్రాపించారు. జమ్మలమడుగు డియల్పి సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట రామిరెడ్డి కార్యక్రమాన్ని పరిశీలించారు. వారు పశు యజమానులకు లాభాలను వివరించి, అర్హులైన గొర్రెల కాపరులు అప్లై చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్