ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్ (18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.