రోడ్డు ప్రమాదంలో గాయపడే వారికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి?

50చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడే వారికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి?
ప్రమాదం జరిగిన సమయంలో సహాయం చేసే వ్యక్తి ముందుగా ఆంబులెన్స్​కు సమాచారం అందించి ప్రథమ చికిత్స ప్రారంభించాలి. బాధితుడి శ్వాస ఆడుతున్నా స్పృహలో లేకుంటే.. ముందుగా గాయాలను తనిఖీ చేయాలి. బాహ్య గాయాలు లేకుంటే అతని తల పైకి ఉండేలా చేసి.. కాళ్లను కొద్దిగా మడవాలి. ఒక వేళ గాయపడిన వ్యక్తి ఊపిరి పీల్చకుంటే వెంటనే సీపీఆర్​ (నోటి ద్వారా శ్వాస అందించటం, ఛాతీ భాగంలో నొక్కటం) చేయాలి. ఈ ప్రక్రియ మీకు పూర్తిగా తెలియకపోతే గుండె భాగంలో నొక్కటం వల్ల కొంత మేర ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్