వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసిపి నేతల పూజలు

54చూసినవారు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసిపి నేతల పూజలు
జమ్మలమడుగు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైసీపీ సీనియర్ నాయకులు వల్లంబాయి హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారు. వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు, మార్తల పెద్ద ఓబుల్ రెడ్డి, శివలింగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్