వీరపునాయునిపల్లె మండలం సంగమేశ్వరాయల వద్ద ఎర్రపల్లె ఇసుక రిచ్ నుంచి ఇసుక రవాణాను ప్రారంభిస్తున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అభ్యర్ధన మేరకు ఇసుక రిచ్ ను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఇసుక కావాల్సినవారు సమీపంలోని సచివాలయాలల్లో ఆన్ లైన్ లో నమోదు చేయించుకోవాలన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని వీఆర్వో రాజశేఖర్ ను ఆదేశించారు.