రాష్ట్ర, జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాలతో ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడప తాడిపత్రి జాతీయ రహదారి వల్లూరు గణేష్ పురం వద్ద గత రెండు రోజులుగా ఓ ట్యాంకరు రోడ్డుపై నిలిచిపోయింది. అయితే సంబంధిత ట్యాంకర్ నిర్వహకులు రేడియం డైవర్షన్ బోర్డులు కూడా పెట్టలేదు. ట్యాంకర్ వెనకాల మొద్దులు పెట్టారు. రాత్రి సమయంలో కనపడకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.