వైవీయూ: ర్యాగింగ్ వద్దు స్నేహం ముద్దు

52చూసినవారు
వైవీయూ: ర్యాగింగ్ వద్దు స్నేహం ముద్దు
ర్యాగింగ్ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడి స్నేహపూరిత వాతావరణంలో చదువులు కొనసాగించాలని వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి. పద్మ పేర్కొన్నారు. వైవీయూలో శనివారం పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రఘునాథరెడ్డితో కలసి పోస్టర్ ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ర్యాగింగ్ కి పాల్పడే వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. నూతన విద్యార్థులకు సీనియర్లు సోదరుల్లా సహకారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్