77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మంగారిమఠం మండలం మల్లెగుడిపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(AP CRPF) కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు బహుమతులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్, స్కూలు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.