పోరుమామిళ్ల మండలంలోని చెన్నారెడ్డి పేట వద్ద జాతీయ రహదారి నిర్మాణ పనులను జేసీ అథితి సింగ్ బుధవారం పరిశీలించారు. కొన్ని చోట్ల నష్టపరిహారం రాని భూముల్లో నిలిచిన పనుల గురించి స్థానిక రైతులతో మాట్లాడారు. రైతులందరికీ నష్టపరిహారం అందుతుందని తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో చంద్రమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.