IPL-2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 11 పరుగులకు ఔట్ అయ్యారు. పదహారో ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన రెండో బంతికి ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ పెవిలియన్ చేరారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి CSK స్కోర్ 101/7గా ఉంది. ప్రస్తుతం ధోనీ(2), జడేజా (9) క్రీజులో ఉన్నారు.