పసిడి ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. తాజాగా ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.1100 పెరిగి రూ.92,150కి చేరింది. హైదరాబాద్‌లోనూ 10 గ్రాముల పసిడి ధర రూ.92 వేలు పలుకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో బంగారం ధర దాదాపు 35 శాతం మేర పెరిగింది. ఏడాది వ్యవధిలో పసిడి ధర దాదాపు రూ.23,730 పెరిగింది అంతర్జాతీయంగా పసిడికి నెలకొన్న డిమాండ్‌తో దేశీయంగానూ దీని ధర పెరిగిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.