AP: వంగవీటి అనే పేరు వింటేనే ఆ ఫీలింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. వంగవీటి అన్న నాలుగు అక్షరాలు ఒక బలమైన సామాజిక వర్గానికి మంత్రాక్షరాలు. అయితే వంగవీటి రంగ పేరు చెప్పుకుని ఎంతో మంది సీనియర్ నేతలు ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో రాధా కొత్త పార్టీ పెడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీ, వైసీపీ, జనసేనలో ఉన్న కాపులు అంతా మద్దతుగా నిలుస్తారని కొందరు అంటున్నారు. అదే జరిగితే ఏపీలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.