
ప్రొద్దుటూరు: సమస్యలను పరిష్కరించాలని వినతి
తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) పట్టణ కార్యదర్శి సాల్మన్, ఉపాధ్యక్షుడు రమాదేవి, మోహన్, రాంబాబు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు సామగ్రి, యూనిఫాం ఇవ్వాలని అలాగే చనిపోయిన కార్మికులకు రూ. 2 లక్షల బీమా, పీఎఫ్ డబ్బు ఇవ్వాలని వారు కోరారు.