
ప్రొద్దుటూరు: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ప్రొద్దుటూరు మండలం కాకిరేనిపల్లె, చౌడూరు గ్రామాలకు కలిపి ఉమ్మడిగా చౌడూరు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అధికారులు పరిష్కరిస్తారన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. తహసీల్దార్ గంగయ్య, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.