
ప్రొద్దుటూరు: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని త్రీటౌన్ పోలీస్టేషన్ సీఐ గోవిందరెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సీఐ రామాంజనేయరెడ్డి సూచించారు. ప్రొద్దుటూరు స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ఓ యువత మేలుకో భాగంగా మత్తు పదార్థాల వినియోగం దాని పర్యావసానం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసుల కళాజాగృతి బృందం లఘు నాటిక ద్వారా వివరించారు.