సోమవారం జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రొద్దుటూరులోని స్థానిక వైఎంఆర్ కాలనీలోని భాష్యం హైస్కూల్ నందు జాతీయ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ వెటర్నరీ ప్రొఫెసర్ రమేష్ హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.