ప్రొద్దుటూరు: లింగ నిర్ధారణ చేసిన స్కానింగ్ సెంటర్లపై చర్యలు

65చూసినవారు
ప్రొద్దుటూరు: లింగ నిర్ధారణ చేసిన స్కానింగ్ సెంటర్లపై చర్యలు
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతి కళ తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ లో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరి కమిటి మీటింగ్ జరిగింది. ఆమె మాట్లాడుతూ. ఆడబిడ్డ అని తెలియగానే కుటుంబ పెద్దల ఒత్తిడితో గర్భస్రావానికి సిద్ధమవుతున్నారన్నారు. ఆడ, మగ బిడ్డలు ఇద్దరు సమానమేనని తెలిపారు.

సంబంధిత పోస్ట్