ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 18న ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్, అమర్రాజ గ్రూప్, ఏఐఎల్ డిక్సన్, నవభారత్ ఫర్టిలైజర్స్, యంగ్ ఇండియా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.