ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు సచివాలయ అడ్మిన్ కంసల ప్రభాకర్ పై అదే వార్డుకు చెందిన జరీఫ్ హుస్సేన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. శుక్రవారం ఇంటి పన్నులో పేరు మార్పు చేయాలని దరఖాస్తు చేయగా రెవిన్యూ అధికారులు తిరస్కరించడంతో జరీఫ్ హుస్సేను ఫోన్ చేసి తనను దుర్భాషలాడి బెదిరించాడని ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రభాకర్ పేర్కొన్నారు.