పులివెందుల: శిథిలావస్థలో వ్యవసాయ శాఖ కార్యాలయం

68చూసినవారు
పులివెందుల: శిథిలావస్థలో వ్యవసాయ శాఖ కార్యాలయం
పులివెందుల పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాక కార్యాలయం చుట్టూ ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలతో నిండి ఉండటంతో విష సర్పాలు తిరుగుతున్నాయని కార్యాలయానికి వచ్చే రైతులు వాపోతున్నారు. అలాగే వ్యవసాయ కార్యాలయంలో మరుగుదొడ్లు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ కార్యాలయంలోని సమస్యలపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్